డాక్యుమెంట‌రీ కోసం కొండ‌చిలువ‌కు జింక‌ను ఎర‌గా వేశారు! త‌రువాత దాని పొట్ట చీల్చి..కుట్లేశారు!

న్యూయార్క్‌: డాక్యుమెంట‌రీని చిత్రీక‌రించ‌డం కోసం ఓ భారీ జింక‌ను కొండ‌చిలువ‌కు ఎర‌గా వేశారు. ఆ జింక బ‌రువు 15.90 కేజీలు. కొండ‌చిలువ బ‌రువు 14.30 కేజీలు. త‌నకంటే బ‌రువైన ప్రాణిని కొండ‌చిలువ ఆహారంగా తీసుకుంటుందా? లేదా? అనేది తెలుసుకోవ‌డం ఈ డాక్యుమెంట‌రీ ఉద్దేశం.

త‌న‌కంటే బరువైన వ‌న్య‌ప్రాణిని కొండ‌చిలువ పూర్తిగా మింగేసింది. బ‌ర్మీస్ జాతి ర‌కానికి చెందిన కొండ‌చిలువ అది. త‌న‌కంటే బ‌రువైన ప్రాణిని ఆహారంగా తీసుకోవ‌డం అసాధార‌ణ‌మ‌ని చెబుతున్నారు. దాన్ని మింగిన త‌రువాత కొండ‌చిలువ క‌ద‌ల‌లేని స్థితికి చేరుకుంది. ప్రాణం పోతుందేమో అనిపించేలా క‌నిపించింద‌ట‌.

 

డాక్యుమెంట‌రీ యూనిట్ స‌భ్యులు వెంట‌నే కొండ‌చిలువ పొట్ట కోసం జింక‌ను బ‌య‌టికి తీశారు. అప్ప‌టికే అది మ‌ర‌ణించింది. జింక‌ను బ‌య‌టికి తీసిన త‌రువాత‌.. మ‌ళ్లీ కొండ‌చిలువ పొట్ట‌ను కుట్టేశారు. ఈ వ్య‌వ‌హారాన్నంతా డాక్యుమెంట‌రీగా చిత్రీక‌రించారు. అమెరికా ఫ్లోరిడాలోని క‌న్జ‌ర్వెన్సీ ఆఫ్ సౌత్ వెస్ట్ ఫ్లోరిడా నేష‌న‌ల్ పార్క్‌లో ఈ షూటింగ్ పూర్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here