డ్రైవ‌ర్‌కు గుండెపోటు..50 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తోన్న బ‌స్సును నియంత్రించ‌లేక‌పోయాడు!

కొప్ప‌ళ‌: విధి నిర్వ‌హ‌ణ‌లో ఓ బ‌స్సు డ్రైవ‌ర్ గుండెపోటుకు గురైన ఉదంతం ఇది. గుండెనొప్పికి గురైన ఆయ‌న 50 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తోన్న బ‌స్సును నియంత్రించ‌లేక పోయారు. టోల్ ప్లాజాను ఢీ కొట్టారు. ఈ ఘ‌ట‌న కొప్ప‌ళ జిల్లాలోని గంగావ‌తి తాలూకా ప‌రిధిలో ఉన్న మ‌ర‌ళి గ్రామంలో చోటు చేసుకుంది. ఈశాన్య క‌ర్ణాట‌క ఆర్టీసీ బ‌స్సు అది.

కొప్ప‌ళ జిల్లాలోని కుక్నూర్ నుంచి మ‌న రాష్ట్రంలోని మంత్రాల‌యానికి బ‌య‌లుదేరిన ఈశాన్య క‌ర్ణాట‌క ఆర్టీసీకి చెందిన స్లీప‌ర్ బ‌స్సు మార్గ‌మ‌ధ్య‌లో మ‌ర‌ళి గ్రామ స‌మీపానికి వ‌చ్చిన స‌మ‌యంలో డ్రైవ‌ర్ నారాయ‌ణ స్వామికి గుండెపోటు వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో బ‌స్సు 60 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తోంది.

గుండెపోటు వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న బ‌స్సు వేగాన్ని త‌గ్గించ‌డానికి ప్ర‌య‌త్నించారు. అది సాధ్యం కాలేదు. బ‌స్సు మొద‌ట ఓ ఎద్దుల‌బండిని, ఓ బైక్‌ను ఢీ కొట్టింది. అనంత‌రం అదే వేగంతో వెళ్లి నేరుగా టోల్ ప్లాజాను ఢీ కొట్టింది. టోల్ ప్లాజా కౌంట‌ర్ ధ్వంస‌మైంది. ఈ ఘ‌ట‌న‌పై గంగావ‌తి రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఈ ఘ‌ట‌న‌లో డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్ స‌హా ప‌లువురు ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. వారిని గంగావతి ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here