బ‌స్ డ్రైవ‌ర్‌ను చెప్పుతో కొట్టిన టీచ‌ర‌మ్మ‌!

రాయ‌చూరు: ఆ టీచ‌ర‌మ్మ‌ ప‌నిచేస్తోన్న పాఠ‌శాల ఎదురుగా బ‌స్సును నిల‌ప‌క‌పోవ‌డ‌మే ఆ డ్రైవ‌ర్ చేసిన పొర‌పాటు. ఎందుకు బ‌స్సును ఆప‌లేదంటూ ఆ టీచ‌ర‌మ్మ ఉగ్ర రూపాన్ని ప్ర‌ద‌ర్శించింది. చెప్పు తీసుకుని డ్రైవ‌ర్‌ను కొట్టింది. ప్ర‌యాణికుల‌తో కిట‌కిటలాడుతున్న బ‌స్సును గంట పాటు ఆపి వేసిందంటే ఆమె సామ‌ర్థ్యం ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు.

ఎవ‌రేమి చెప్పినా బ‌స్సును క‌ద‌ల‌నివ్వ‌లేదు. క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూరు జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బ‌స‌వ‌మ్మ అనే ఉపాధ్యాయురాలు రాయ‌చూరు నుంచి మన రాష్ట్రంలోని క‌ర్నూలుకు బ‌య‌లుదేరిన క‌ర్ణాట‌క ఆర్టీసీ బ‌స్సు ఎక్కారు. అది ఎక్స్‌ప్రెస్ బ‌స్సు. ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఆప‌డానికి ఛాన్స్ లేదు.

మార్గ‌మ‌ధ్య‌లో వామ‌న‌క‌ల్లూర గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల ముందు బ‌స్సును ఆపాల్సిందిగా ఆమె డ్రైవ‌ర్ చెన్న‌ప్ప‌ను కోరారు. ఎక్స్‌ప్రెస్ బ‌స్సు అని, గ్రామంలో ఆపుతాన‌ని ఆయ‌న బ‌దులిచ్చారు. దీనితో మొద‌లైన వాగ్యుద్ధం.. చెప్పు తీసుకుని కొట్టే స్థాయికి చేరింది. ఆ స‌మ‌యంలో బ‌స్సు 30 మంది వ‌రకు ప్ర‌యాణికులు ఉన్నారు.

వారు ఎంత చెప్పినా.. ఆమె వినిపించుకోలేదు. బ‌స్సును వెన‌క్కి తీసుకెళ్లాల్సిందేనంటూ ప‌ట్ట‌బ‌ట్టారు. సుమారు గంట పాటు బ‌స్సు వామ‌న క‌ల్లూరలో నిలిచిపోయింది. చివ‌రికి పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల్సి వ‌చ్చింది. పోలీసులు వ‌చ్చి ఆమెను స‌ర్దిచెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై క‌వితాళ పోలీస్‌స్టేష‌న్‌లో బ‌స‌వ‌మ్మ‌పై కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here