ఆమె చేసిన ప‌నికి! అరుదైన వ‌ణ్య‌ప్రాణుల‌ను నిప్పుల‌పై ఫ్రై చేసి లొట్ట‌లేసుకుంటూ ఆర‌గించింది!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న మ‌హిళ పేరు లిన్ టుక్‌. త‌న భ‌ర్త ఫౌన్ రాటి, కుమారుడితో క‌లిసి కాంబోడియా రాజ‌ధాని నామ్‌పెన్హ్‌లో నివాసం ఉంటోంది. సులువుగా డ‌బ్బ‌లు సంపాదించాల‌నే ఉద్దేశంతో.. అరుదైన వ‌న్య‌ప్రాణుల‌ను ప‌ట్టుకుని, చంపి వాటి రెసిపీని త‌యారు చేయాల‌ని, ఈ త‌తంగాన్నంత‌టినీ షూట్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఆ ఆలోచ‌న రావ‌డ‌మే త‌డ‌వుగా నామ్‌పెన్హ్ స‌మీపంలోని అట‌వీ ప్రాంతానికి వెళ్లారు. అడ‌వి పిల్లి, పాము, నెమ‌లి వంటి కొన్ని అరుదైన వ‌న్య‌ప్రాణులు, ప‌క్షుల‌ను చంపి, నిప్పుల‌పై కాల్చి మ‌రీ ఆర‌గించింది. ఆమె ఇలా లొట్ట‌లేసుకుని తింటోంటో.. భ‌ర్త వాట‌న్నింటినీ షూట్ చేశాడు. యుట్యూబ్‌లో పోస్ట్ చేశారు. క్లిక్స్ రూపంలో వ‌చ్చే భారీ ఆదాయం గురించి క‌ల‌లు కంటూ కూర్చున్నారు.

ఈ వీడియో యుట్యూబ్‌లో పోస్ట్ అయిన వెంట‌నే భారీగా వ్యూస్ వ‌చ్చాయి. దానితో పాటు విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. అంతేనా! అరుదైన జీవ‌జాలాన్ని చంపి, భుజించిన నేరానికి పోలీసులు లిన్ టుక్‌పై కేసు న‌మోదు చేశారు. వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here