మ‌హేష్‌, ఎన్టీఆర్‌ల స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించిన ఈ న‌టి ఎవ‌రో చెప్పుకోగ‌ల‌రా?

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న న‌టి ఎవ‌రో ఓ ప‌ట్టాన గుర్తు ప‌ట్ట‌డం క‌ష్టమే. ఎందుకంటే- ఆమె సినిమాల్లో న‌టించేట‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికీ చాలా తేడా ఉంది. ఆమె న‌టించిన మొద‌టి సినిమానే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌. ఆ త‌రువాత వ‌రుస‌గా హిట్లు కొట్టింది. మ‌హేష్‌బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్ వంటి యంగ్ జ‌న‌రేష‌న్ హీరోల ప‌క్క‌న కూడా హీరోయిన్‌గా న‌టించింది. ఆమే ర‌క్షిత‌.

 

ర‌క్షిత న‌టించిన మొద‌టి చిత్రం ఇడియ‌ట్‌.. ఎలాంటి హిట్ కొట్టిందో మ‌న‌కు తెలుసు. ఆ త‌రువాత నిజంలో మ‌హేష్‌బాబు ప‌క్క‌న‌, ఆంధ్రావాలాలో ఎన్టీఆర్ ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించింది.

 

నాగార్జునతో శివ‌మ‌ణి, అంద‌రివాడులో చిరంజీవి ప‌క్క‌న ఆడి, పాడింది. బేసిక్‌గా క‌న్న‌డ న‌టి అయిన ర‌క్షిత‌.. రెండు చోట్లా ప‌రిశ్ర‌మ‌కు దూర‌మైంది. సినిమాల‌కు గుడ్‌పై చెప్పిన త‌రువాత ఆమె రాజ‌కీయాల్లో అడుగు పెట్టారు. క‌న్న‌డ నాట బీజేపీలో కొన‌సాగుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here