ప‌ట్టు లాల్చీ, పంచె క‌ట్టుకుని పొంగ‌లి వండుతోన్న ఆయ‌న ఓ దేశానికి ప్ర‌ధాని అంటే న‌మ్మ‌గ‌ల‌రా?

వేదిక‌పై ఏర్పాటు చేసిన క‌ట్టెల‌పొయ్యిపై పొంగ‌లిని వండ‌టానికి రెడీ అవుతోన్న ఆయ‌న ఎవ‌రో అస్స‌లు ఊహించ‌లేం. బంగారురంగు ప‌ట్టు లాల్చీ, ప‌ట్టు పంచె క‌ట్టుకుని తెలుగు, త‌మిళ సంస్కృతి ఉట్టిప‌డేలా క‌నిపిస్తోన్న ఆయ‌న కెన‌డా ప్ర‌ధాన‌మంత్రి జ‌స్టిన్ ట్రూడీ.

తెలుగు, త‌మిళ సాంప్రదాయ తమిళ వస్త్రధారణతో సంద‌డి చేశారు. కెన‌డాలో స్థిర‌ప‌డిన త‌మిళులు టోరంటోలో నిర్వ‌హించిన పొంగ‌ల్ కార్య‌క్ర‌మానికి ఆయ‌న, టోరంటో మేయ‌ర్‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు.

నీలంరంగు లాల్చీ వేసుకున్న వ్య‌క్తి టోరంటో మేయ‌ర్ జాన్‌టోరీ. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన త‌మిళుల‌తో క‌లిసి వారిద్ద‌రూ ఫొటోలు దిగారు. ఉల్లాసంగా గ‌డిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here