డివైడ‌ర్‌ను ఢీ కొట్టి..గాల్లోకి ఎగిరి విద్యుత్ స్తంభాన్ని ప‌డ‌గొట్టి..!

బీజింగ్: చైనాలో ఓ కారు బీభ‌త్సాన్ని సృష్టించింది. ఓ చిన్నపాటి విధ్వంసాన్ని రేపింది. మితిమీరిన వేగంతో వ‌చ్చిన ఓ కారు మొద‌ట డివైడ‌ర్‌ను ఢీ కొట్టింది. మితి మీరిన వేగం కదా? అందుకే డివైడ‌ర్‌ను ఢీ కొట్టి ఆగిపోలేదు. సినిమాల్లోలా గాల్లోకి ఎగిరింది.

రోడ్డుకు ఆనుకునే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అక్క‌డికీ ఆగ‌లేదు. విద్యుత్ స్తంభాన్ని కూడా త‌న‌తో పాటు తీసుకెళ్లింది. దాని దెబ్బ‌కు ఆ స్తంభం రెండుగా విరిగిపోయింది. కారు మాత్రం ఆగ‌లేదు. క‌రెంటు స్తంభాన్ని ఢీ కొట్టిన వేగంతో ప‌ల్టీ కొట్టింది.

త‌ల‌కిందులైంది. ఇక్క‌డ డ్రైవ‌ర్ ప‌రిస్థితి ఏమై ఉంటుంద‌నే ఆందోళ‌న క‌ల‌గ‌డం అత్యంత స‌హ‌జం. డ్రైవ‌ర్ మాత్రం సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డాడు. ఒళ్లు దులుపుకొంటూ కారులోంచి బ‌య‌టికి వ‌చ్చాడు.

ఇదంతా అక్క‌డ అమ‌ర్చిన సీసీ కెమెరాల్లో స్ప‌ష్టంగా రికార్డ‌య్యింది. ఈ ఘ‌ట‌న చైనాలోని లియుఝూలో ఈ నెల 10వ తేదీన చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది. దీనికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని లియుఝూ ట్రాఫిక్ పోలీసులు తాజాగా విడుద‌ల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here