విమానంలో మంట‌లు! అందుబాటులో నీళ్లు లేవు! ఎలా ఆర్పారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

బీజింగ్‌: టేకాఫ్ తీసుకోవ‌డానికి రెడీగా ఉన్న విమానం అది. చైనాలోని గ్వాంగ్ఝౌ నుంచి షాంఘై వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ తీసుకోవ‌డానికి రెడీ అయిన‌ట్టు అనౌన్స్‌మెంట్ కూడా వినిపించింది. హ‌ఠాత్తుగా విమానంలో కూర్చున్న ప్ర‌యాణికులు గ‌భ‌రా ప‌డ్డారు. ల‌గేజీ ర్యాక్‌లో మంట‌లు చెల‌రేగాయి.

స‌రిగ్గా టేకాఫ్ కోసం బ‌య‌లుదేరిన వెంట‌నే లగేజీ కంపార్ట్‌మెంట్ నుంచి పొగ‌లొచ్చాయి. ఆ వెంట‌నే భ‌గ్గుమంటూ మంట‌లు అంటుకున్నాయి. దీన్ని గ‌మ‌నించిన ప్ర‌యాణికులు, విమాన సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. కొద్దిసేపు నీళ్ల కోసం వెదికారు.

ఎవ‌రి ద‌గ్గ‌రా లేవు. దీనితో ఓ సిబ్బంది.. త‌న వ‌ద్ద ఉన్న జ్యూస్‌తో మంట‌ల‌ను ఆర్పివేశారు. జ్యూస్ బోటిల్ తీసుకుని లగేజీ కంపార్ట్‌మెంట్ వైపు ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి, దాన్ని మంట‌ల‌పై చల్ల‌డం వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

దీనితో విమానాన్ని ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిపివేశారు. విమానాశ్ర‌య భ‌ద్ర‌త సిబ్బంది చేరుకుని, బ్యాగ్‌ను ప‌రిశీలించారు. ప‌వ‌ర్ బ్యాంక్ పేలిపోవ‌డం వ‌ల్లే మంట‌లు అంటుకున్న‌ట్లు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

ఈ ఘ‌ట‌న‌తో విమానం మూడు గంట‌ల పాటు ఆల‌స్యంగా బ‌య‌లుదేరింది. అప్ప‌టికే- ప్ర‌యాణికుల‌ను మ‌రో విమానంలో షాంఘైకి పంపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here