పరిటాల శ్రీరామ్ పై సంచలన ఆరోపణలు.. మారణాయుధాలతో వచ్చి..!

ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు.. దివంగత తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి కుమారుడైన పరిటాల శ్రీరామ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బోయ సూర్యం సంచలన ఆరోపణలు చేశారు. పరిటాల శ్రీరామ్ తన అనుచరులతో వచ్చి మారణాయుధాలతో తనను బెదిరించాడని.. అక్కడితో ఆగకుండా తనను తీసుకొని వెళ్ళి కొట్టారని ఆరోపణలు చేశారు.

ఈ విషయంపై బోయ సూర్యం అనంతపురం జిల్లా ఎస్పీకి తన ఫిర్యాదును రిజిష్టర్ పోస్టులో పంపారు. ఈ నెల 7న వైసీపీ నేతలు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి, రామ లింగారెడ్డిలతో కలిసి బోయ సూర్యం పేరూరులో పర్యటించారట. అయితే ఈ విషయం పరిటాల శ్రీరాంకు నచ్చలేదట. దీంతో శ్రీరామ్ తన అనుచరులు మాదాపురం శంకర్, కొత్తపల్లి శివకుమార్ తదితరులతో సూర్యం ఇంటికి వచ్చి బెదిరించి తీసుకెళ్లారట.. అక్కడ చిత్రహింసలకు గురి చేశారని మీడియాతో చెప్పుకున్నాడు సూర్యం. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతో కలిసి తిరిగితే చంపేస్తామని బెదిరించారట. వారు తనపై దాడి చేయడంతో తన చేయి విరిగిందని.. దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి కట్టు కట్టించారన్నారు.

తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని.. తోపుదుదర్తి బద్రర్స్ ప్రధాన అనుచరుడిగా చెప్పారు. చంపుతామని బెదిరించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయిస్తుంటే పోలీసులు ప్రేక్షకుల్లా మిగిలిపోయారని బోయ సూర్యం ఆరోపించారు. అదే సంతకంతో వైసిపి నేతలు తోపుదుర్తి చందు, నాగరాజులపై తప్పుడు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తనపై దాడి చేసిన పరిటాల శ్రీరామ్.. అతని అనుచరులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here