నేనే కోటేశ్వరరావు.. పవన్ కళ్యాణ్ పై కేసు పెడుతున్నా..!

నామాల కోటేశ్వరరావు అనే వ్యక్తి హీరో పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టారు. అందుకు కారణం ఏమిటంటే అగ్నాతవాసి సినిమా లోని కొడకా కోటేశ్వరరావు పాట అట. తాను కొన్నేళ్ళుగా ఎంతో గౌరవ మర్యాదలతో బ్రతికానని.. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సినిమాలోని కొడకా కోటేశ్వరరావు పాట విడుదల అయిందో.. అప్పటి నుండి నామాలా కోటేశ్వరరావు అనే నన్ను.. కొడకా కోటేశ్వరరావు అని పిలుస్తున్నారని చెప్పుకొచ్చారు.

కోటేశ్వరరావు అనే పేరు గల వారందరూ చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వారి గౌరవానికి భంగం కలిగించేలా ఈ పాటను పవన్ కళ్యాణ్ పాడారని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ మా మనోభావాలను దెబ్బతీశారని అందుకే ఆయనపై కేసు పెడుతున్నానని చెప్పారు. సినిమాలో ఆ పాటను తీసేయాలని విజయవాడకు చెందిన కోటేశ్వరరావు అనే న్యాయవాది మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అయినా న్యాయవాది గారూ సినిమా స్టార్టింగ్ లో ‘ఈ చిత్రంలోని పాత్రలు, పేర్లు కల్పితాలు.. ఇవి ఎవరినీ ఉద్దేశించబడినవి కావు’ అని వేస్తారు.. అది గమనించలేదా మీరు..!

Lawyer lodge police complaint on kodaka koteswar rao song

అజ్ఞాతవాసిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈయనే..!ఈయన ఏమని ఫిర్యాదు చేశారంటే..

Bharat Todayさんの投稿 2018年1月10日(水)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here