వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో షాక్..!

2014 ఎన్నికల సందర్భంగా పెద్దిరెడ్డి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో వైసీపీ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా తప్పులు పొందుపరిచారని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయన మీద వేసిన పిటీషన్ పై విచారణ మొదలుపెట్టారు. ఎన్నికల అఫిడవిట్ లో భార్య గురించి తప్పుడు సమాచారం ఇచ్చినట్టు దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది.

ముఖ్యంగా 2014 ఎన్నికల సందర్భంగా పెద్దిరెడ్డి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయని పుంగనూరు టీడీపీ అభ్యర్థి వెంకటరమణరాజు మొదట హై కోర్టును ఆశ్రయించారు. అఫిడవిట్ లో తన భార్యను ఒక చోట గృహిణిగా, మరోచోట కంపెనీ ఎండీగా చూపించారని ఆ పిటీషన్ లో ఆయన పేర్కొన్నారు. అందుకు సంబంధించి తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను కూడా అందించారు. అయితే, ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో కేసు సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. పిటిషనర్ చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయని… పూర్తి స్థాయిలో విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది. భార్య విషయంలోనే కాకుండా ఆస్తుల విషయంలో కూడా పెద్దిరెడ్డి అబద్దాలు చెప్పారని వెంకటరమణరాజు ఆరోపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో 31,731 ఓట్ల తేడాతో వెంకటరమణరాజు ఓడిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here