వైఎస్ జగన్, అంబటి రాంబాబుపై కేసు కొట్టివేత..!

వైఎస్ జగన్, అంబటి రాంబాబులపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును హైకోర్టు కొట్టేసింది. అయితే ఇది ఇప్పట్లో నమోదైన కేసు కాదు.. 2011 లో కులం పేరుతో కొందరు తనను దూషించారని.. ఎన్.వెంకటస్వామి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అందుకు కారణం వైసీపీ అధినేత వైఎస్ జగన్.. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అని కోర్టుకు ఎక్కారు. కానీ వారి ప్రమేయం లేదని కోర్టు తీర్పును ఇచ్చింది.

Image result for ambati rambabu and YS Jagan

2011 ఫిబ్రవరి 20న వీరిపై ఈ కేసు నమోదైంది. ఇందిరాపార్క్ వద్ద ఆమరణ దీక్ష చేస్తున్న తనపై కొందరు నేతలు దాడి చేసి, కులం పేరుతో దూషించారని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో ఎన్.వెంకటస్వామి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తాను దీక్ష చేస్తున్న సమయంలోనే జగన్ దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారని… వారి దీక్ష కోసం తన టెంట్ ను తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ దూషించింది వేరే వాళ్ళు అయినా జగన్, రాంబాబు మీద ఎందుకు కేసు పెట్టారని న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here