100 కోట్ల రూపాయల విలువైన విగ్రహాలను కొట్టేశారు.. ఎప్పుడు ఫిర్యాదు చేస్తున్నారంటే..!

తమిళనాడు లోని తంజావూరు ప్రాచీన దేవాలయాలకు ప్రసిద్ధి.. ఎన్నో సంవత్సరాల చరిత్ర ఆ నగరానికి ఉంది. అయితే ఇప్పుడు అదే తంజావూరు ఓ దొంగతనం విషయంలో వార్తల్లో నిలిచింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 100 కోట్ల రూపాయల విలువైన దొంగతనం అక్కడి గుడిలో చోటుచేసుకుంది.. దొంగలు వెళ్ళిపోయాక కుక్కలు మొరిగినట్లు.. దొంగతనం జరిగిన దాదాపు 50 ఏళ్ల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తంజావూరు లోని పెద్ద గుడిలో ఉన్న రెండు కాంస్య విగ్రహాలను ఎవరో కొట్టేశారు. శుక్రవారం నాడు ఆలయ సిబ్బంది పెరియపెరుమాళ్(మొదటి రాజ రాజ చోళుడు), లోగమాదేవియార్(మొదటి రాజ రాజ చోళుడి భార్య లక్ష్మి) విగ్రహాలు పోయాయని పోలీసులకు సమాచారం అందించారు. అది కూడా 50 సంవత్సరాల తర్వాత..! ఒక్కో విగ్రహం దాదాపు 75సెంటీమీటర్ల పొడవు ఉన్నాయని పోలీసులు తెలిపారు. బృహదీశ్వరాలయంలోనే ఇలా జరగడంతో అందరూ అవాక్కయ్యారు. ఒక విగ్రహం విలువ 60 కోట్లు కాగా.. మరో విగ్రహం విలువ 40 కోట్లని పోలీసులు తెలిపారు. మొదటి రాజ రాజ చోళుడు మొత్తం 13విగ్రహాలను అప్పట్లో గుడికి ఇచ్చాడట.. అందులోనివే ఈ రెండు విగ్రహాలు..! మిగతా 11 విగ్రహాల విషయం ఇంకా బయటకు రాలేదు. చివరిసారిగా ఈ విగ్రహాలను 50 ఏళ్ల క్రితం ఆలయంలో ఉన్నట్లు చూశారు. ఆ తర్వాత ఇప్పుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎప్పుడు ఎవరు కొట్టేశారో.. ఎవరు.. ఎవరికి అమ్మేశారో ఆ బృహదీశ్వరుడికే తెలియాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here