మూడు రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయట..!

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎం లలో నగదు కొరత ఏర్పడింది. చాలా ఏటీఎంలలో డబ్బులు అసలు లేకుండా పోయాయి. దీనిపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. అయితే ఇంకో మూడు రోజుల వరకూ ఈ నోటు కష్టాలు తప్పేటట్టులేవు. ఎందుకంటే ఏటీఎంలలో డబ్బులు నింపడానికి మూడు రోజుల సమయం కోరింది కేంద్ర ప్రభుత్వం.

మరో మూడు రోజుల్లో పరిస్థితి సర్దుకుంటుందని ప్రకటించింది కేంద్రప్రభుత్వం.కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి ఎస్పీ శుక్లా స్పందిస్తూ, తమ వద్ద రూ. 1.25 లక్షల కోట్ల కరెన్సీ ఉందని, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ కరెన్సీ, మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కరెన్సీ ఉన్న కారణంగా ఇబ్బందులు వచ్చాయని, తాను ఏర్పాటు చేసిన రాష్ట్రాల కమిటీలు, ఆర్బీఐ ఈ నగదును సమానంగా అన్ని రాష్ట్రాలకూ చేరుస్తుందని తెలిపారు. ఇది జరిగేందుకు కనీసం మూడు రోజులు పడుతుందని ఆయన చెప్పారు. డిపాజిట్లు తక్కువగా ఉన్నాయని, ఏటీఎంల నుంచి విత్ డ్రాలు అధికంగా ఉండటమే డబ్బులు లేకపోవడానికి కారణమని బ్యాంకులు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజర్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఇబ్బంది అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here