ఈ ఆడపిల్లి ఇంతగా షాక్ అవ్వడానికి కారణం ఏమిటో తెలుసా..?

కొందరు తమ ఇంట్లో పెంచుకునే జంతువులను అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంటారు. వాటికి సంబంధించిన ఏ విషయాన్నైనా వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. కొన్ని పెట్ కేర్ సెంటర్లు కూడా వాటిని అలాగే చూసుకుంటూ ఉంటాయి. విదేశాల్లో అయితే ఇంకా బాగా చూసుకుంటారనుకోండి. ఓ పెట్ కేర్ సెంటర్ లో ఈ పిల్లి గర్భంలో మార్పు రావడం గమనించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. అక్కడ సోనోగ్రఫీ చేయగా ఆ పిల్లి గర్భంతో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన సమయంలోనే అలా ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది ఈ పిల్లి. తాను తల్లి కాబోతోందని షాక్ కు గురైనట్లుగా పిల్లిని కరెక్ట్ టైమ్ లో ఫోటో తీశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలు గ్రీన్ లాండ్ లో ఉంటున్న ‘ఉల్లా’ అనే పిల్లివి. ఈ ఫోటోలను రెడ్డిట్ అనే సోషల్ మీడియా సైట్ లో పెట్టడంతో దీనికి భీభత్సమైన లైక్ లు వస్తున్నాయి. దాదాపు 90000 సార్లకు పైగా లైక్ చేశారు. ఇంకొన్ని రోజుల్లో ఉల్లా నాలుగు లేదా అయిదు పిల్లలకు జన్మనివ్వబోతోందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here