ఆ వాట్స‌ప్ గ్రూపు పేరు `కిడ్స్ త్రిపుల్ ఎక్స్‌`! అందులో ఉండేవ‌న్నీ..! పాకిస్తానీయులు కూడా!

ల‌క్నో: ఆ వాట్స‌ప్ గ్రూపు పేరు `కిడ్స్ త్రిపుల్ ఎక్స్‌..` ఈ పాటికి అర్థ‌మ‌య్యే ఉంటుంది అదెలాంటి గ్రూపో. అందులో ఉండేవ‌న్నీ ఛైల్డ్ పోర్న్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు. కుప్ప‌లు తెప్ప‌లుగా వాటిని వాట్స‌ప్ గ్రూప్‌లో స‌ర్కులేట్ చేస్తోన్న వ్య‌క్తిని అరెస్టు చేయ‌డానికి ఏకంగా సీబీఐ రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది.

ఎట్ట‌కేల‌కు ఆ గ్రూప్ అడ్మిన్‌ను అరెస్టు చేశారు. ఆ అడ్మిన్ వ‌య‌స్సు కేవ‌లం 20 సంవ‌త్స‌రాలే. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ క‌న్నౌజ్‌కు చెందిన ఆ యువ‌కుడి పేరు నిఖిల్ వ‌ర్మ‌. కామ‌ర్స్ గ్రాడ్యుయేట్‌. `కిడ్స్ త్రిపుల్ ఎక్స్` పేరుతో వాట్స‌ప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశాడు.

 

దేశ‌, విదేశాల‌కు చెందిన 119 మందిని ఈ గ్రూప్‌లో స‌భ్యులుగా చేర్చుకున్నాడు. వారు కోరిన విధంగా ఛైల్డ్ పోర్న్ క్లిప్పులు, వీడియోలు, ఫొటోల‌ను గ్రూప్‌లో అప్‌లోడ్ చేసేవాడు. దీనికోసం ఆ గ్రూప్ స‌భ్యులు ప్ర‌తినెలా అత‌ని బ్యాంక్ అకౌంట్‌లో భారీ మొత్తంలో డ‌బ్బుల‌ను జ‌మ చేసేవారు. ఇదే అత‌ని ఆదాయ‌మార్గం.

దీనిపై ఫిర్యాదులు అంద‌డంతో ఏకంగా సీబీఐ రంగంలోకి దిగింది. కూపీ లాగింది. ఢిల్లీ, మ‌హారాష్ట్ర, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ల‌ల్లో ద‌ర్యాప్తు చేప‌ట్టింది. చివ‌రికి క‌న్నౌజ్‌లో వాట్స‌ప్ గ్రూప్ అడ్మిన్ నిఖిల్ వ‌ర్మ‌ను అరెస్టు చేశారు సీబీఐ అధికారులు.

అమెరికా, చైనా, బ్రెజిల్‌.. చివ‌రికి పాకిస్తానీయులు కూడా ఈ గ్రూప్‌లో స‌భ్యులుగా ఉన్నారు. ఛైల్డ్ పోర్న్ కోసం నిఖిల్ వ‌ర్మ ఓ గ్యాంగ్‌నే న‌డిపిస్తున్నాడ‌ట‌.

పిల్ల‌ల‌తో పాడు ప‌నులు చేయించి, వాటిని వీడియో తీయించి, గ్రూప్‌లో పోస్ట్ చేసేవాడు. గ్రూప్ స‌భ్యుల నుంచి డ‌బ్బులు రాబ‌ట్టుకునే వాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here