దాణా కేసులో లాలూకు శిక్ష పడింది.. 21 ఏళ్ల పాటూ సాగిన కేసు..!

భారతదేశంలో న్యాయం అంత తొందరగా రాదేమోనని అనిపిస్తుంది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం గురించి తెలిస్తే..! 21 ఏళ్ల పాటూ సాగుతూ వెళ్ళిన కేసులో ఆయనకు నేడు జైలు శిక్షను ఖరారీ చేశారు. శిక్ష ఖరారు చేయడం కూడా ఒక రోజు లేట్ అయింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయిన లాలూ ప్రసాద్ యాదవ్ కు దాణా కుంభకోణం కేసులో మూడున్నర సంవత్సరాల జైలు శిక్షను విధించారు.

జార్ఖండ్‌లోని రాంచీ సీబీఐ ప్ర‌త్యేక కోర్టు జ‌డ్డి ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వీరికి శిక్ష‌ను ఖ‌రారు చేశారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కి మూడున్నరేళ్ల జైలు శిక్షతో పాటు ఐదు లక్షల జరిమానా విధిస్తున్నట్లు జడ్జి తీర్పు వెల్లడించారు. మిగతా దోషులకు కూడా ఇదే శిక్షను విధించారు. అనారోగ్యం, వయోభారం దృష్టిలో ఉంచుకుని మానవీయ కోణంలో తనకు తక్కువ శిక్ష విధించాలని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సీబీఐ కోర్టు న్యాయమూర్తిని కోరారు. ఇక ఆర్జేడీ పార్టీ భవితవ్యం ఆయన వారసుల చేతుల్లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here