వీడెక్కడ యజమాని రా బాబు..!

ఒక రెస్టారెంట్ కు వచ్చిన వాళ్ళకు నాణ్యమైన వంటకాలు ఇవ్వడం వారి బాధ్యత.. ముఖ్యంగా ఓనర్ ఎటువంటి తప్పులు కూడా జరగకుండా చూసుకోవాలి.. అదే తమ హోటల్ కు దగ్గర లోనే మరో హోటల్ ఉంటే.. అంతకంటే మంచి టేస్ట్ ఉన్న ఫుడ్ ను మనం అందించాలి.. కానీ ఈ ఓనర్ ఎంతో చెత్త పని చేసి సీసీటీవీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. ఇంతకూ ఏమి చేశాడనే కదా మీ అనుమానం.. మీరే చూడండి..

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలోని డోగేబేఈ నూడుల్స్ షాప్ లో చెత్త పని చేశాడు.. రెస్టారెంట్ లో పెట్టిన బీఫ్ సూప్ లో ఓ వ్యక్తి మూత్రం పోస్తుండగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఇంతకూ ఈ పని ఎందుకు చేశాడంటే స్థానికంగా ఉన్న మరో రెస్టారెంట్ ఓనర్ ఇతడట.. ఈ రెస్టారెంట్ ఓనర్ తో వ్యాపారంలో పోటీ పడలేక ఈ పనికి ఒడిగట్టాడు. బీఫ్ సూప్ లో నుండి ఏదో వింతైన వాసన వస్తుండడం గమనించి.. సీసీటీవీలను చెక్ చేశారు.. చూస్తే ఈ వ్యక్తి చేసిన పని బయటపడింది. దీంతో పోలీసులను ఆశ్రయించాడు రెస్టారెంట్ ఓనర్..! అదే మనం మంచి వంటకాలు తయారు చేసి డిమాండ్ పెంచుకోవాలి కానీ.. ఇలాంటి చెత్త పని చేయడం ఏంటి బాబూ..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here