కొన్ని నిమిషాలలో పెళ్ళి తంతు పూర్తి అవుతుందనేలోపే.. ఇంతలో పెళ్ళి కొడుకు స్నేహితుడు..!

ఇంకొద్ది నిమిషాలు ఉంటే పెళ్ళి తంతు పూర్తీ అయ్యేది.. కానీ పెళ్ళి కొడుకు స్నేహితుడు చేసిన పనికి పెళ్ళి మంటపం మొత్తం రోదనలతో నిండిపోయింది. స్నేహితుడికి పెళ్ళి అయిపోతోందన్న ఆనందంలో ఉన్న అతడి స్నేహితుడు.. తన దగ్గర ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరుపుతూ ఉన్నాడు. ఇంతలో ఉన్నట్లుండి ఓ తూటా పెళ్ళి కొడుకు ఛాతీ లోకి దిగబడిపోయింది. దీంతో పెళ్ళి కొడుకు కుప్పకూలిపోయాడు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని లఖ్మిపూర్ ఖేరి జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. సునీల్ వర్మ అనే వ్యక్తికి పెళ్ళి జరుగుతోంది. అతడితో పాటూ అతడి స్నేహితుడు రామ చంద్ర కూడా అక్కడే ఉన్నాడు. ఇతరులతో కలిసి ఉన్న రామచంద్ర తన లైసెన్స్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత కాల్పులు జరుపుతూ.. సునీల్ వర్మ మీదకు కూడా తుపాకీని గురిపెట్టాడు, మొదటి సునీల్ వర్మ పక్కన నుండి వెళ్ళగా రెండోది మాత్రం అతడి ఛాతీ లోకి దూసుకుపోయింది. దీంతో సునీల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రామచంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్ళి వేడుకలలో భాగంగానే తూటాలు పేల్చారని బంధువులు చెబుతున్నారు. అయితే ఈ హత్య వెనుక వేరే కోణం కూడా ఉండవచ్చని పోలీసులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here