జెర్రి దెబ్బకు పామే ప్రాణాలు కోల్పోయింది..!

మనం సర్వసాధారణంగా చూసే జీవులలో జెర్రి కూడా ఒకటి. ఎక్కడైనా కాస్త చెత్త ఉందంటే చాలు చేరిపోతుంటాయి. వీటిలో కొన్ని కరుస్తాయి కూడానూ..! మన దేశంలో కాస్త సైజులో చిన్నగా ఉన్నవి కనిపిస్తాయి కానీ.. విదేశాల్లో ఇవి చాలా పెద్ద సైజుల్లో ఉంటాయి. అత్యంతప్రమాదకరమైనవి కూడానూ..!

అయితే ఇవి ఎంత బలమైనవొ నిరూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అదేమిటంటే ఏకంగా పామునే చంపేసే అంత..! నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. పాముకూ దీనికీ జరిగిన పోరులో పాము ఘోరంగా ఓడిపోవడమే కాకుండా ప్రాణాలనే కోల్పోయింది. కావాలంటే ఈ వీడియో చూడండి. చాలా సేపు వరకూ జరిగిన పోరాటంలో మొదట పాము పైచేయి సాధించినట్లు కనిపించినా.. చివరికి జెర్రి గెలిచింది. జెర్రి తన కోరలను పాము గొంతులోకి దింపేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎక్కడ జరిగిందో సరైన సమాచారం లేదు. లైవ్ లీక్ వెబ్ సైట్ ఈ వీడియోను అప్లోడ్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here