మక్కాకు వెళ్ళేవారికి ఎటువంటి సబ్సీడీ ఇవ్వమని సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..!

ప్రతి ఏడాదీ పవిత్ర మక్కా యాత్రకు వెళ్ళే వారికి కేంద్ర ప్రభుత్వం సబ్సీడీ ఇస్తూ వస్తూ ఉంటుంది. అయితే ఇకపై ఆ సబ్సీడీ అనేది ఉండదని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్రతి ఏడాది సౌదీలోని మక్కా, మదీనా నగరాల్లో జరిగే పవిత్ర హజ్‌యాత్రకు వెళ్లే భారత ముస్లిం యాత్రికులకు ఇచ్చే సబ్సిడీను ఎత్తివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆ విషయాన్ని స్పష్టం చేశారు. మైనార్టీలను మరింత పటిష్ఠం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 1.75 లక్షల మంది ముస్లింలు హజ్‌యాత్రకు వెళ్లనున్నారు. వారంతా సబ్సడీ లేకుండానే తీర్థయాత్రకు వెళ్లనున్నారు. ఇకపై హజ్ సబ్సిడీ నిధులను దేశంలో బాలికల విద్యా, మహిళా సాధికారత కోసం ఉపయోగిస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు.

సాధారణంగా హజ్ యాత్రికులను విమానాలు, నౌకల ద్వారా పంపుతూ ఉంటారు. వారి ప్రయాణానికి కావాల్సిన మొత్తంలో కొంతవరకూ ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంటుంది. ఇది పేదల కోసం వినియోగించాలి. కానీ కొందరికి ఆర్థిక స్థోమత ఉన్నా కూడా పేదవారిమనే చెప్పి హజ్ కు సబ్సీడీ ద్వారా వెళుతున్నారని పలు ఆరోపణలు వచ్చాయి. 2018 లో హజ్ కు వెళ్ళే భారతీయుల సంఖ్యను మరో 5000 పెంచింది సౌదీ అరేబియా ప్రభుత్వం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here