సినీ నటుడు చలపతిరావుకు ప్రమాదం..!

ప్రముఖ సినీ నటుడు చలపతిరావుకు ప్రమాదం జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అల్లరి నరేష్ సినిమా షూటింగ్ లో భాగంగా బస్సు వెనుక నిచ్చెన ఎక్కుతుండగా ఒక్కసారిగా కింద పడిపోవడంతో వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ చలపతిరావును అపోలో ఆసుపత్రికి తరలించారు.

ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నాడని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్టు సమాచారం. చలపతిరావు ఆరోగ్య పరిస్థితిని చిత్ర నిర్మాత, హీరో అల్లరి నరేశ్ వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here