ఆల‌యంలో పెళ్లి..ఆ వెంట‌నే సెల్ ట‌వ‌ర్‌కు ఉరి!

జాంజ్‌గీర్‌: మొబైల్ ట‌వ‌ర్‌కు ఉరి వేసుకుని ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఉదంతం ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని జాంజ్‌గీర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని డోంగ‌రీగావ్ గ్రామానికి చెందిన ఆ జంట పేర్లు అజ‌య్ యాద‌వ్‌, సున‌య‌న ప‌టేల్‌.

ఒకే గ్రామానికి చెందిన వారిద్ద‌రూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్ద‌రి కులాలు వేర్వేరు కావ‌డంతో రెండు కుటుంబాల వారూ ఈ పెళ్లికి అంగీక‌రించ‌లేదు. పైగా ఇద్ద‌రి మ‌ధ్యా వ‌య‌స్సులో కూడా తేడా ఉంద‌ని అభ్యంత‌రం చెప్పారు.

సున‌య‌న వ‌య‌స్సు 18 సంవ‌త్స‌రాలు కాగా అజ‌య్ యాద‌వ్ వ‌య‌స్సు 32. త‌మ పెళ్లికి పెద్ద‌లు అభ్యంత‌రం చెబుతుండ‌టంతో వారు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై బ‌లౌదా పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here