కేసీఆర్ విషయంలో తాను చేసిన పొరపాటు ఊహకు కూడా అందనిదన్న చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా ఇంటర్వ్యూలో పలు విషయాల గురించి మాట్లాడారు. తాను అధికారంలో ఉన్నప్పుడు పలు ప్రయోగాలు చేశానని.. అందులో భాగంగా కొన్ని పొరపాట్లు చేశానని చెప్పుకొచ్చాడు. అందులో ఒకటి కేసీఆర్ కు పదవి ఇవ్వకపోవడం అని చంద్రబాబు అన్నారు.

కీర్తి కోసం చేసిన పొరపాటు వలన కేసీఆర్ తో సమస్య వచ్చిందని.. అందుకోసమే అప్పట్లో పదవి ఇవ్వలేకపోయానని చంద్రబాబు నాయుడు అన్నారు. కొన్ని కొన్ని విషయాలు మీ చేతల్లో ఉండవని చంద్రబాబు చెప్పారు. అలాంటిదే కేసీఆర్ విషయంలోనూ చోటుచేసుకుందని అన్నారు. ఇది ఊహకు కూడా అందని విషయం అని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ‘జడ్జిమెంట్ ఆఫ్ ఎర్రర్’ జరిగిందని.. ఆరోజు అది కానీ జరగకుండా ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉండి ఉండేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here