వైయస్‌ఆర్‌ తో వ్యక్తిగత సంబంధం గురించి బయటపెట్టిన చంద్రబాబు.. ఇల్లు అమ్ముకోనివ్వలేదనే..!

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడిగా 40 ఏళ్ళు పూర్తీ చేసుకున్నారు. అందుకు సంబంధించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ పలు విషయాలను ప్రస్తావించారు. తనకు వైఎస్.రాజశేఖర్ రెడ్డి కి మధ్య ఉన్న సంబంధం గురించి చంద్రబాబు నాయుడు బయటపెట్టారు.

తనకూ రాజశేఖర్ రెడ్డికి ఎప్పుడు కూడా వ్యక్తిగత వైరం లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. మొదట్లో తాము కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కలిసి తిరిగినవాళ్ళమేనని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ తర్వాత తాను తెలుగుదేశంలోకి వచ్చానని.. వైఎస్ కాంగ్రెస్ లోనే ఉండిపోయారని.. కాంగ్రెస్ లో ఉండి తను ఫైట్ చేశారని.. తెలుగుదేశంలో మారాక తాను ఫైట్ చేశానని చెప్పారు. తాను ఎప్పుడూ పొలిటికల్ ఫైట్ గానే భావించానని ఎప్పుడు కూడా పర్సనల్ ఫైట్ గా భావించలేదని చంద్రబాబు తెలిపారు.

తాను మాజీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా ‘రూడ్’ గా ప్రవర్తించారని.. అందుకే తమ మధ్య అప్పట్లో మాటలు లేవని చెప్పారు. తాను ఓ వైఎస్ ఇల్లు అమ్ముకోడానికి అడ్డుపడడానికి ముఖ్య కారణం అది ప్రభుత్వ భూమి అని చెప్పుకొచ్చారు. ఇంకా కొన్ని విషయాలు చెప్పారు.. ఈ వీడియో చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here