జగన్ ఏమన్నారు.. చంద్రబాబు ఏమి చెప్పారు..!

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు హోదా కోసం పోరు గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను ఒకటే చెబుతున్నానని, ఈ నెల 21న అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని, తమకు మద్దతు పలకాలన్నారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టినా నేను మద్దతిస్తా, నేను అవిశ్వాసం పెట్టినా చంద్రబాబు మద్దతివ్వాలన్నారు. మీకు సమయం ఇచ్చేందుకే అవిశ్వాసం తేదీని 21కి నిర్ణయించామన్నారు.

ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు స్పందించారు. 11 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తిని తాను అనుసరించడం ఏంటని వ్యాఖ్యానించారు. ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాము అవిశ్వాసం పెడతామని, టీడీపీ మద్దతివ్వాలని జగన్ డిమాండ్ చేయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. జాతీయ రాజకీయాలను జగన్ దగ్గర తానిప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. టీడీపీ తీసుకున్న నిర్ణయంపై జాతీయ స్థాయిలో పలు పార్టీల అభిప్రాయాలను ఇప్పటికే అడిగి తెలుసుకున్నానని, ఎన్నో పార్టీలు మద్దతు పలికాయని వెల్లడించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here