టీడీపీ-బీజేపీ తెగదెంపులు.. సుజనా చౌదరి, అశోక్‌ గజపతిరాజు రాజీనామా..!

అనుకున్నదే జరిగింది.. తెలుగుదేశం పార్టీ, బీజేపీ మధ్య సంబంధాలు తెగిపోయాయి. రాత్రి 10.30 గంటల తరువాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రత్యేక హోదా ఇవ్వబోమని, ప్యాకేజీలు కూడా సరిగా ఇవ్వబోమని చెప్పిన భాగస్వామితో ఇక కలిసుండటం కుదరదని తేల్చి చెప్పారు. కేంద్రమంత్రులుగా ఉన్న సుజనా చౌదరి, అశోక్‌ గజపతిరాజు రాజీనామా చేయనున్నారని తెలిపారు.

ప్రజల హక్కుల కోసమే తాను పోరాడుతున్నానని, నాడు ఇచ్చిన హామీల్లో తాను కూడా భాగస్వామినన్న విషయాన్ని బీజేపీ మరచిపోయిందని ఆయన అన్నారు. నాడు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నేతలు కూడా డిమాండ్‌ చేశారన్న విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు, ఇప్పుడు ఇతర రాష్ట్రాల సెంటిమెంట్‌ను బూచిగా చూపించడం ఏంటని ప్రశ్నించారు. విభజన హామీలన్నీ నెరవేర్చాలని తాను ఎంతగానో పోరాడానని చెప్పారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మీడియా సమావేశం అనంతరం రాష్ట్రాన్ని ఆదుకునే ఉద్దేశం బీజేపీకి ఏమాత్రం లేదని అర్థం అయిందని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here