గులాబీ వజ్రం గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు..!

గత కొద్ది రోజులుగా తెలుగు ప్రజలు తిరుమల వెంకటేశ్వర స్వామి నగల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వజ్రాల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కోట్ల విలువ చేసే గులాబీ వజ్రపు ఉంగరాన్ని కొట్టేశారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.

ప్రజల్లో అనుమానాలు వచ్చేలా ఆరోపణలు చేస్తూ బీజేపీ కుట్రలు పన్నుతోందని.. రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తార. ఈ రోజు విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో ధర్మ పోరాట బహిరంగ సభలో మాట్లాడుతూ… వెంకటేశ్వర స్వామి తనను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తున్నాడని, శ్రీవారికి అపచారం తలపెట్టిన వాడు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తాడని వ్యాఖ్యానించారు.
తిరుపతిలో పోయింది వజ్రం కాదని, కెంపు మాత్రమేనని కమిటీలు చెప్పాయని చంద్రబాబు తెలిపారు. సంప్రదాయాలు పాటించే పరిశుభ్రమైన ఆలయం తిరుపతి అని, పోటులో ఏదో జరిగిపోతోందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆ ప్రధాన అర్చుకుడిని ఢిల్లీకి పిలిపించుకుని కుట్రలు పన్నారని రమణ దీక్షితులను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణుల కోసం కార్పోరేషన్‌ పెట్టానని, బ్రాహ్మణుల్లోనూ పేదవారు ఉన్నారని, వారికి న్యాయం చేస్తున్నానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here