ఫుట్‌బాల్ మ్యాచ్ చూడ్డానికి వెళ్లిన ఈ యువ‌తి..మృత‌దేహం న‌గ్నంగా! స్టేడియానికి 2 కిలోమీట‌ర్ల దూరంలో!

ఛాంపియ‌న్స్ లీగ్ ఫుట్‌బాల్ ఫైన‌ల్ మ్యాచ్ చూడ్డానికి వెళ్లిన ఈ యువ‌తి ఇక మ‌ళ్లీ ఇంటిరి స‌జీవంగా తిరిగి రాలేదు. మ్యాచ్ ముగిసిన త‌రువాత స్టేడియం నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ఆమెను న‌లుగురు యువ‌కులు అప‌హ‌రించారు. పిక‌ప్ వ్యాన్‌లో ఎత్తుకెళ్లి, సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం- దారుణంగా హ‌త్య చేశారు.

ఈ ఘ‌ట‌న థాయ్‌లాండ్‌లోని ఛంతాబురిలో గ‌త శ‌నివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన విజువ‌ల్స్ తాజాగా వెలుగులోకి వ‌చ్చాయి. ఈ విజువ‌ల్స్‌ను థాయ్ పోలీసులు విడుద‌ల చేశారు. బాధితురాలి పేరు నాంగ్ గిఫ్ట్. వ‌య‌స్సు 21 సంవ‌త్స‌రాలు. ఛంతాబురి ఉన్న‌త విద్యను అభ్య‌సిస్తోంది.

గ‌త శ‌నివారం ఛంతాబురిలోని స్టేడియంలో ఫుట్‌బాల్ ఛాంపియ‌న్స్ లీగ్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. లివ‌ర్‌పూల్ ఫుట్‌బాల్ క్ల‌బ్ అంటే నాంగ్‌గిఫ్ట్‌కు చాలా ఇష్టం. త‌న అభిమాన జ‌ట్టు ఆడుతుండ‌టంతో ఆగ‌లేకపోయింది. మ్యాచ్ ముగిసిన త‌రువాత ఇదివ‌ర‌కే ప‌రిచ‌యం ఉన్న ఓ యువ‌కుడు ఆమెను ప‌ల‌క‌రించాడు.

 

స్టేడియానికి ఆనుకుని ఉన్న ఓ ప‌బ్‌కు వెళ్లారు. ఆ స‌మ‌యంలో నాంగ్‌గిఫ్ట్ స్నేహితులు కూడా ఉన్నారు. ప‌బ్‌లో మ‌ద్యం సేవించిన ఆ యువ‌తి మ‌త్తులోకి జారుకోగా.. తాను ఆమెను ఇంటి వ‌ద్ద డ్రాప్ చేస్తానంటూ ఆ యువ‌కుడు త‌న ముగ్గురు స్నేహితులతో క‌లిసి ఆమెను పిక‌ప్ వ్యాన్‌లో తీసుకెళ్లాడు. ఆ త‌రువాత నాంగ్ గిఫ్ట్ ఇక ఎవ్వ‌రికీ క‌నిపించ‌లేదు.

ప‌బ్ నుంచి తెల్ల‌వారు జామున 2 గంట‌ల స‌మ‌యంలో తీసుకెళ్లిన న‌లుగురు యువ‌కులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంత‌రం- గొంతు నులిమి హ‌త్య చేశారు. ప‌బ్ నుంచి న‌లుగురు యువ‌కులు నాంగ్ గిఫ్ట్‌ను చేతుల‌పై ఎత్తుకెళ్ల‌డం అక్క‌డ అమ‌ర్చిన సీసీటీవీ కెమెరాల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది.

 

ప‌బ్‌కు రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఓ నిర్జ‌న ప్ర‌దేశంలో నాంగ్ గిఫ్ట్ మృత‌దేహం న‌గ్నంగా క‌నిపించింది. ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నాయి. దీని ఆధారంగా- అత్యాచారం త‌రువాత ఆమెను కొట్టి చంపి ఉంటార‌ని పోలీసులు అనుమానించారు. ఈ హ‌త్యోదంతం త‌రువాత స్థానిక పోలీసులు శ‌ర‌వేగంగా స్పందించారు. ప‌బ్‌లో సీసీటీవీ కెమెరాల ఆధారంగా న‌లుగురినీ అరెస్టు చేశారు. వారిని న‌ట్ట‌ఫాంగ్, ప‌ట్టిబూన్థ‌ల్‌, ప‌న్యాచాన్‌, సురాసిట్‌గా గుర్తించారు. వారిలో ప‌న్యాచాన్ వ‌య‌స్సు 18 సంవ‌త్స‌రాలే. బుధ‌వారం వారిని అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here