ఛార్మి ఏంటి అలా అయిపోయింది.. చేతికి బ్యాండేజ్ కూడానూ..!

తమ యాక్టింగ్ తో అలరించి.. ఆ తర్వాత కనపడకుండా పోయిన హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికీ కుతూహలం ఉంటుంది. 10 సంవత్సరాలకు పైగా తెలుగులో హీరోయిన్ గా అలరించింది ఛార్మి.. అలాంటి ఛార్మి హీరోయిన్ గా మానేసి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాల పనులను చూసుకుంటూ ఉంది. ప్రస్తుతం ఛార్మికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పైసా వసూల్ సినిమా హీరోయిన్ అయిన ముస్కాన్ సేథితో కలిసి ఛార్మీ ఓ ఫోటో తీయించుకుంది. అందులో ఛార్మీ చాలా బొద్దుగా కనిపించడమే కాకుండా చేతికి బ్యాండేజ్ తో కనిపించింది. ఈ ఫోటోను చూసి ఛార్మీకి ఏమైంది అని ఒకే ప్రశ్నను వేస్తున్నారు. మెహబూబా సినిమా పనులు చూసుకుంటున్న ఛార్మి చేతికి గాయం ఎలా అయిందో తెలియాల్సి ఉంది. ముస్కాన్ సేథీ ఇటీవల హైదరాబాద్ లో ఒక ఫోటోషూట్ నిర్వహించగా ఆమెను కలవడానికి ఛార్మి వచ్చింది. అయితే ముస్కాన్ చాలా రోజుల తరువాత కలుసుకోవడంతో ఛార్మితో ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అంతే కాకుండా గెట్ వెల్ సూన్ మేడమ్ అని కూడా పోస్ట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here