చివర్లో బ్రాత్ వైట్ బాదుడు.. ఇక బౌలింగే సన్ రైజర్స్ ను ఫైనల్ కు చేర్చాలి..!

ఐపీఎల్ మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాట్మెన్ విఫలమయ్యారు. మొదటి బంతికే శిఖర్ ధావన్ వికెట్ ను పోగొట్టుకొని కష్టాల్లో పడ్డ సన్ రైజర్స్ జట్టును చివర్లో కార్లోస్ బ్రాత్ వైట్ ఆదుకున్నాడు. 29 బంతుల్లో 43 పరుగులు చేసిన బ్రాత్ వైట్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముందు 140 పరుగుల లక్ష్యాన్ని ఉంచాడు. ఇక సన్ రైజర్స్ బలంగా చెప్పుకున్న బౌలింగ్ విభాగం రాణిస్తేనే ఫైనల్ కు చేరేలా చేస్తుంది. లేదంటే కోల్ కతాకు వెళ్ళి క్వాలిఫయర్ ఆడాల్సిందే.

మొదటి బంతికే శిఖర్ ధావన్ ను బౌల్డ్ చేసి చాహర్ చెన్నై బృందంలో ఆనందాన్ని నింపాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ ధాటిగా ఆడాడు. కానీ 24 పరుగుల వద్ద శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్ లో కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గోస్వామి 12, మనీష్ పాండే 8, షకీబ్ 12 పరుగులు చేసి అవుటయ్యారు. చివర్లో యూసుఫ్ పఠాన్ 24 పరుగులు, కార్లోస్ బ్రాత్ వైట్ నాలుగు సిక్సర్లు బాది 43 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. శర్ధూల్ ఠాకూర్ నాలుగు ఓవర్ల పాటూ బౌలింగ్ వేసి 50 పరుగులు సమర్పించుకున్నాడు. జడేజా అద్భుతంగా 4 ఓవర్లు బౌలింగ్ వేసి 1 వికెట్ తీసుకోవడమే కాకుండా కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here