ధోని, రాయుడు, రైనా, వాట్సన్.. అవుట్..!

మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన బౌలింగ్ తో రాణిస్తోంది. క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో 140 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కాస్త కష్టంగానే కనిపిస్తోంది. బంతి టర్న్ అవుతూ ఉండడంతో సన్ రైజర్స్ కు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.

140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మొదటి ఓవర్ లోనే షేన్ వాట్సన్ ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. ఆ తర్వాత సురేష్ రైనా ధాటిగా ఆడినప్పటికీ సిద్ధార్థ్ కౌల్ బౌల్డ్ చేసి సన్ రైజర్స్ శిబిరంలో ఆనందాన్ని నింపాడు. ఆ తర్వాతి బంతికే రాయుడును కూడా బౌల్డ్ చేసి.. మరో షాక్ ను ఇచ్చాడు కౌల్. ఇక నిదానంగా ఆడుదామనుకున్న ధోని ని రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 18 బంతులు ఆడిన ధోని కేవలం 9 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి క్రీజులో 13 పరుగులతో డుప్లెసిస్.. 3 పరుగులతో బ్రావో ఆడుతున్నారు. 10 ఓవర్లకు 50 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here