డుప్లెసిస్ ఫినిషింగ్ కు సన్ రైజర్స్ షాక్..!

దాదాపు విజయం సన్ రైజర్స్ సొంతం అని అనుకున్న తరుణంలో డుప్లెసిస్ ఒంటరి పోరాటం సన్ రైజర్స్ హైదరాబాద్ ను విజయం ముంగిట బోల్తా పడేలా చేసింది. రాయుడు, ధోని, వాట్సన్.. ఇలా అందరూ చేతులెత్తేసిన వేళ డుప్లెసిస్ ఒక్కడే చెన్నై కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. చివరి మూడు ఓవర్లలో విజయానికి 43 బంతులు అవసరం కాగా, డుప్లెసిస్ రెచ్చిపోయాడు. 4, 6,4,4తో చెలరేగిపోయాడు. కేవలం 2.1 ఓవర్లలో 43 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్.. ఆదివారం జరగబోయే ఫైనల్ కు నేరుగా అర్హత సాధించింది.


టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. అద్భుత ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధవన్ గోల్డెన్ డక్ అయ్యాడు. తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ గోస్వామి- కెప్టెన్ విలియమ్స్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 34 పరుగుల వద్ద లుంగి ఎంగిడి బౌలింగ్‌లో గోస్వామి (12) ఔటయ్యాడు. మరో రెండు పరుగులు జోడించిన తర్వాత విలియమ్సన్ (24) కూడా పెవిలియన్ చేరాడు. అలా కేవలం 36 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. చివర్లో కార్లోస్ బ్రాత్‌వైట్ 29 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 43 పరుగులు, యూసుఫ్ పఠాన్ 29 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.

అనంతరం 140 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై తొలి ఓవర్ ఐదో బంతికి ఖాతా తెరవకుండానే ఓపెనర్ షేన్ వాట్సన్ (0) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 24 పరుగుల వద్ద సురేశ్ రైనా (22)ను సిద్ధార్థ్ కౌల్ పెవిలియన్ పంపాడు. దీంతో హైదరాబాద్ బౌలర్లు క్రమంగా పట్టు బిగించారు. వరుసపెట్టి వికెట్లు తీస్తూ చెన్నైపై ఒత్తిడి పెంచారు. రాయుడు (0), ధోనీ (9), బ్రావో (7), రవీంద్ర జడేజా (3), దీపక్ చాహర్ (10), హర్భజన్ సింగ్ (2) అందరూ అవుట్ అయ్యారు. అయితే డుప్లెసిస్ చివర్లో ఇలా షాక్ ఇస్తాడని హైదరాబాద్ అభిమానులు అసలు ఊహించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here