12 సార్లు పెళ్లి చూపులు ఫెయిల‌య్యాయనే ఫ్ర‌స్ట్రేష‌న్‌లో..ఘాతుకం!

రాయ్‌పూర్‌: తనకు పెళ్లి కావడంలేదనే అక్క‌సుతో ఓ యువ‌కుడు రాక్ష‌సుడిగా మారాడు. ప‌క్కింటి అమ్మాయిని గొంతు నులిమి హ‌త్య చేశాడు. క‌త్తితో ప‌లుమార్లు పొడిచి చంపాడు. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని రాయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. నిందితుడి పేరు పింటూ. రాయ్‌పూర్ శివార్ల‌లోని మెరుతి గ్రామానికి చెందిన వాడు.

అత‌నికి పెళ్లి చేయ‌డానికి ఇంట్లో వాళ్లు రెండేళ్లుగా పెళ్లి సంబంధాల‌ను చూస్తున్నారు. ఇప్ప‌టిదాకా- పింటూ డ‌జ‌ను సార్లు పెళ్లి చూపుల‌కు వెళ్లాడు. ఎవ్వరూ అత‌ణ్ని పెళ్లి చేసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. దీనితో అత‌ను తీవ్ర నిరాశ‌కు గుర‌య్యాడు. ఆ కోపాన్ని, అస‌హ‌నాన్ని త‌న ప‌క్కింట్లో నివ‌సించే అమెరికా ప‌టేల్ అనే యువతిపై చూపాడు.

అమెరికా ప‌టేల్ త‌ల్లిదండ్రులు కూర‌గాయ‌ల వ్యాపారులు. కూర‌గాయల‌ను విక్ర‌యించ‌డానికి వారు సంత‌కు వెళ్లారు. ఆ యువ‌తి ఇంట్లో ఒంట‌రిగా ఉండ‌టాన్ని చూసిన పింటూ ఘ‌ర్ష‌ణ ప‌డ్డాడు. చున్నీతో గొంతు బిగించి హ‌త్య చేశాడు. అనంత‌రం- అక్క‌డి నుంచి పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా, స్థానికులు ప‌ట్టుకుని దేహ‌శుద్ధి చేశారు. పోలీసుల‌కు అప్ప‌గించారు. అమెరికా ప‌టేల్ చేత‌బ‌డి చేస్తోంద‌ని, దానివ‌ల్లే త‌న‌కు పెళ్లి కావ‌ట్లేద‌ని పింటూ పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here