మ‌న‌వ‌డి బ‌ర్త్‌డే నాడు చంద్ర‌బాబు టీటీడీకి ఎంత విరాళం ఇచ్చారో తెలుసా?

చిత్తూరు: ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న కుటుంబంతో స‌హా బుధ‌వారం ఉద‌యం తిరుమ‌ల‌కు విచ్చేశారు. శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. మ‌నవ‌డు దేవాన్ష్ పుట్టినరోజు సంద‌ర్భంగా ఆయ‌న టీటీడీకి 26 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విరాళంగా ఇచ్చారు.

అనంత‌రం భార్య భువ‌నేశ్వ‌రి , కోడ‌లు బ్రాహ్మణి, బావ‌మరిది, ఎమ్మెల్యే బాలకృష్ల‌తో క‌లిసి శ్రీ‌వారి అన్న‌ప్రసాదాన్ని వ‌డ్డించారు. శ్రీవారి సేవకుల స్కార్ఫ్‌ ధరించి భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. అనంతరం కుటుంబ సభ్యలుందరూ అన్నదానం కాంప్లెక్స్‌లో అల్పాహారం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here