చెత్త‌కుప్ప నుంచి దుర్వాస‌న‌.. చూడాలంటే భ‌యం! పోలీసులు ప‌రిశీలించ‌గా, ఓ సంచిలో!

రోడ్డు ప‌క్క‌న ఓ టీ పాయింట్ వ‌ద్ద ఉన్న చెత్త కుప్ప నుంచి కొద్దిరోజులుగా దుర్వాస‌న వ‌స్తోంది. చెత్త‌కుప్ప క‌దా అని స‌రిపెట్టుకున్నారు స్థానికులు. రానురాను ఏ మాత్రం భ‌రించ‌లేని విధంగా దుర్వాస‌న వెద‌జ‌ల్లింది. వెళ్లి చూద్దామంటే భయం. దీనితో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు అక్క‌డికి వెళ్లి చూశారు.

 

చెత్తను తొల‌గించగా.. ఓ సంచి బ‌య‌ట‌ప‌డింది. అందులో నుంచే ఆ దుర్వాస‌న వ‌స్తోంద‌ని గ్ర‌హించారు. దాన్ని బ‌య‌టికి తీసి చూడ‌గా.. అందులో కుళ్లిపోయిన కొన్ని చేప‌లు క‌నిపించాయి. దీనితో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

సికింద్రాబాద్ చిల‌క‌ల‌గూడ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న శివా టీ పాయింట్ వ‌ద్ద బుధ‌వారం ఉద‌యం చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది. శివా టీ పాయింట్‌కు కొద్ది దూరంలో హ‌లీమ్ బ‌ట్టీ వెనుక ఉన్న ఖాళీ ప్ర‌దేశం నుంచి ఆ దుర్వాస‌న వెద‌జ‌ల్లింది. ఆ చేపల సంచిని స్థానికుల‌కు చూపించి, భయపడకూడదని, వారికి ధైర్యం చెప్పారు చిల‌క‌ల‌గూడ పోలీసులు.

ఫొటోలు: ఎస్‌హెచ్ఓ/చిల‌క‌ల‌గూడ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here