తల్లుల్లో ఇలాంటి తల్లులు ఉన్నారయా.. బ్యాడ్ మదర్ అని నెటిజన్లు అంటున్నారు ఈ వీడియో చూసి..!

చిన్న పిల్లలు ఉన్నప్పుడు తల్లులు జాగ్రత్తగా ఉండాలి.. అదే రోడ్డు దాటడం లాంటి పనులు పిల్లలు చేస్తున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో..! ఇక్కడ ఉన్న తల్లి మాత్రం చాలా చెడ్డపేరు తెచ్చుకుంది కనీసం పిల్లలను పట్టించుకోకుండా.. రోడ్డు దాటుతుండగా తన ఇద్దరు పిల్లలను అసలు పట్టించుకోకపోవడంతో ఒక పిల్లాన్ని కారు వచ్చి గుద్దేసింది. ఇంతకూ ఆమె పిల్లలను పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటని అనుకుంటూ ఉన్నారా.. ఫోన్ చూస్తూ ఉండిపోవడమే..!

ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి రోడ్డు మీదకు వచ్చింది. జీబ్రా క్రాసింగ్ వద్దకు రాగానే ఆ తల్లి ఫోన్ లో మునిగిపోయింది. పిల్లలను పట్టించుకోలేదు. ఇంతలో ఆ పిల్లలు వాళ్ళంతకు వాళ్ళే రోడ్డు దాటడానికి ప్రయత్నించారు. అలా ప్రయత్నిస్తూ ఉండగా పిల్లలు తల్లి ఎంతసేపటికి ముందుకు రాకపోవడంతో తిరిగి వెనుకకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతలో ఓ కారు వచ్చి ఒక పిల్లాడిని గుద్దేసింది. ఈ ఘటన మొత్తం అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిపోయింది. సోషల్ మీడియాలో వీడియో బయటకు రావడంతో ఆమెను అందరూ బాగా తిడుతున్నారు. ఇలాంటి తల్లులు మన సమాజంలో ఉండడం సిగ్గు చేటు అని అంటున్నారు. బ్యాడ్ మదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఈమెకు ఇవ్వాలని అంటున్నారు. ఈ ప్రమాదంలో ఆ పిల్ల వాడికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి.

https://www.facebook.com/shanghaiist/videos/10156765110056030/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here