మోచేతి వ‌ద్ద ఎర్ర‌గా, కంక‌ణంలా పెరిగిన కురుపు ఎందుకొచ్చిందో తెలుసుకుని విస్తుపోయారు!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న‌ది ఓ నాలుగేళ్ల బాలిక కుడి చెయ్యి. మోచేతికి కాస్త కిందుగా, ఎర్ర‌గా, కంక‌ణంలా కురుపు ఏర్ప‌డింది. అలా ఎలా ఏర్ప‌డిందో తెలుసుకోలేక‌పోయారు అటు ఆ బాలిక పేరెంట్స్ గానీ, ఇటు డాక్ట‌ర్లు గానీ. అన్ని ర‌కాలుగా ప‌రీక్షించిన‌ప్ప‌టికీ.. అదేమిటో వారికి అర్థం కాలేదు.

ఎక్స్‌రే తీసిన‌ప్ప‌టికీ.. ఫ‌లానా దాని వ‌ల్ల ఆ రెడ్ రింగ్ ఏర్ప‌డింద‌ని డాక్ట‌ర్లు నిర్ధారించి చెప్ప‌లేక‌పోయారు. మొద‌ట్లో చిన్న‌గా ఉండ‌టంతో ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. రానురాను, అది పెరిగింది. మందంగా త‌యారైంది. చెయ్యి క‌ద‌ప‌లేని స్థితికి చేరుకుందా బుడ్డ‌ది.

ఇక జాప్యం చేయకూడ‌ద‌నుకుంటూ త‌ల్లిదండ్రులు ఓ పెద్దాసుప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ ఎక్స్‌రే తీయ‌గా ఏమీ క‌నిపించ‌లేదు. మైక్రో స్కానింగ్ చేయ‌గా.. అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. రూపాయి కాసంత వెడ‌ల్పు ఉండే ర‌బ్బ‌రు బ్యాండ్ చ‌ర్మంలో ఇరుక్కుని క‌నిపించింది.

దాని వ‌ల్లే చ‌ర్మం, మాంసం ఇన్ఫెక్ష‌న్ బారిన ప‌డి.. అలా త‌యారైంద‌ని తేల్చాడు డాక్ట‌ర్లు. వెంట‌నే ఆ పాప‌ను శ‌స్త్ర చికిత్స చేసి.. ఆ ర‌బ్బ‌ర్ బ్యాండ్‌ను బ‌య‌టికి తీశారు. దాదాపు- మూడేళ్లుగా ఆ పాప శ‌రీరంలో ఉంద‌ట ఆ ర‌బ్బ‌ర్ బ్యాండ్‌. దీనితో- అది కాస్తా చ‌ర్మాన్ని, మంసాన్ని తొలిచేసి, లోనికి వెళ్లి కూర్చుంది.

చైనాలోని ఈస్ట‌ర్న్ అన్‌హుయ్ ప్రావిన్స్‌లోని లిన‌క్వాన్ కంట్రీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ పాప అస‌లు పేరేంటో తెలియ‌ట్లేదు గానీ.. అంద‌రూ లీలీ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. హ్యాంగ్ఝౌలోని ఝెజియాంగ్ యూనివ‌ర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఆసుప‌త్రిలో పాపకు శ‌స్త్ర చికిత్స చేశారు. చిన్నారుల చ‌ర్మం సుతిమెత్త‌గా ఉంటుంద‌ని, అందుకే ఆ ర‌బ్బ‌ర్ బ్యాండ్ చ‌ర్మాన్ని, మాంసాన్ని తొలిచేసింద‌ని చెప్పారు. ఏడాది వ‌య‌స్సున్న పాప మోచేతికి దాన్ని తొడిగించి, మ‌రిపోయి ఉంటార‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here