అక్క‌డ ఒక్క చ‌ర్చి కూడా క‌నిపించ‌కూడ‌ద‌ట‌! డైన‌మేట్లు పెట్టి మ‌రీ పేల్చేస్తున్నారు!

క‌మ్యూనిస్టు దేశం చైనా. అక్క‌డ చర్చిల కూల్చివేత శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. దేశ‌వ్యాప్తంగా ఎంపిక చేసిన చ‌ర్చిల‌ను డైన‌మేట్లు పెట్టి పేల్చివేస్తున్నారు అక్క‌డి అధికారులు.

తాజాగా ప్రముఖ ఎవలాంజికల్‌ చర్చ్ ది గోల్డెన్‌ ల్యాంప్‌ స్టాండ్ చర్చిని చైనా ప్రభుత్వం డైనమైట్‌ తో పేల్చేసింది. షాన్‌ఘ్జీ ప్రావిన్స్‌లో ఉందీ చ‌ర్చి. వంద‌ల సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉంది ఈ చ‌ర్చికి.

చ‌ర్చిల పేల్చివేత‌పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. క్రిస్టియన్‌ సంఘాలు అక్కడి కమ్యునిస్ట్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆధ్యాత్మిక జీవన నియంత్రణ పేరుతో చర్చిల కూల్చివేత ప్రారంభించింది చైనా ప్రభుత్వం.

కొద్దిరోజులుగా వందలాది చర్చిలను నేలకూల్చింది. చర్చిల వరుస కూల్చివేతల వెనుక రహస్య అజెండా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి క్రైస్తవ సంఘాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here