చైనా ఫోన్ పేలింది.. ఇదీ పరిస్థితి..!

చైనా ఫోన్లు.. తక్కువ రేటుకే మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయని.. మంచి ఫీచర్లు ఉంటాయని ఎగబడి కోనేస్తుంటాం..! కానీ వాటి వలన కొన్ని కొన్ని సార్లు ఎంత ప్రమాదం సంభవిస్తుందో ఊహించడానికే భయమేస్తుంది. అలాంటి ఘటనే ఒకటి చైనాలో చోటు చేసుకుంది. 12 ఏళ్ల మెంజ్ జిషూ అనే కుర్రాడి చేతిలో ఫోన్ పేలగా అతడు చూపుడు వేలు పోవడమే కాకుండా కుడి కన్ను చూపు కూడా దెబ్బతింది. బాలుడి తల, కన్ను, ముఖం భాగాల్లో ఇరుక్కున్న ప్లాస్లిక్ ముక్కలను తొలగించి సర్జరీ చేసి బాలుడ్ని కాపాడారు వైద్యులు. దాదాపు అయిదు గంటల పాటూ ఈ సర్జరీ చేశారు. పిల్లాడు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు.


దక్షిణ చైనాలోని గ్వాంగ్జి ప్రావిన్స్‌ కు చెందిన 12ఏళ్ల మెంజ్ జిషూ తన హువా టాంగ్ వీటీ-వీ59 మోడల్ మొబైల్‌ ను ఛార్జింగ్‌ పెట్టి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆ సమయంలో మెంజ్ జిషూ తన గదిలో ఒంటరిగా ఉన్నాడు. అతడు తన ఫోన్ ను చేతిలోకి తీసుకోగానే వెంటనే భారీ శబ్దంతో అది పేలిపోయింది.

ఈ ప్రమాదంలో అతడి చూపుడు వేలు పూర్తిగా దెబ్బతింది. అలాగే అతడి కుడి కంటిపై తీవ్రమైన ప్రభావం చూపింది. మొబైల్ ప్లాస్టిక్ ముక్కలు బాలుడి తల, కంట్లోకి చొచ్చుకెళ్లడంతో క్షణాల్లో కుప్పకూలిన బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో బాలుడ్ని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఐదు గంటలపాటు సర్జరీ చేసి జిషును కాపాడినట్టు వైద్యులు తెలిపారు. అతడి చూపుడు వేలును అతికించడానికి ప్రయత్నించామని.. కానీ అది వీలుపడలేదని వైద్యులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here