సొంత ఇల్లు మంట‌ల్లో త‌గ‌ల‌బడుతోంటే..సెల్ఫీ దిగారు!

ఇల్లు మంట‌ల్లో చిక్కుకుని బూడిద అవుతోంటే..ప్రాణాల‌ను ద‌క్కించుకునే ప్ర‌య‌త్నం చేస్తాం. వీలైతే.. విలువైన వ‌స్తువుల‌ను ప‌ట్టుకుని బ‌య‌టికి ప‌రుగెత్తుతాం.

ఓ జంట మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించింది. ఎలాగూ ఇల్లు త‌గుల‌బ‌డుతోంది క‌దా! అని అనుకుంటూ సెల్ఫీ దిగారు. అత‌గాడి భార్య మాత్రం భ‌య‌ప‌డుతున్న‌ప్ప‌టికీ..అత‌ను ఏమాత్రం బెరుకు, భ‌యం లేకుండా న‌వ్వుకుంటూ సెల్ఫీలు దిగాడు.

ఈ ఘ‌ట‌న చైనా ద‌క్షిణ ప్రాంతంలోని గ్ఝుయిలిన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. శనివారం చెంగ్‌ అనే వ్యక్తి ఇంట్లో ఉన్నట్లుండి మంటలు చెల‌రేగాయి. అవి కాస్త ఇల్లంతా వ్యాపించాయి.

ఆ సమయంలో చెంగ్ బాత్‌రూమ్‌లు ఉన్నాడు. మంట‌లు చెల‌రేగిన విష‌యం తెలిసిన వెంట‌నే బాత్‌రూమ్‌లోంచి బ‌య‌టికి వ‌చ్చి, ఆర్ప‌డానికి ప్ర‌యత్నించాడు.

చుట్టుప‌క్క‌ల వారు కూడా సాయం చేశారు. అప్పటికే చాలాభాగం మంట‌ల్లో చిక్కుకుంది.

ఇక చేసేదేమీ లేద‌ని అనుకున్నాడో ఏమో గానీ.. చెంగ్‌ తన భార్యతో కలిసి కాలిపోయిన తన ఇంటి ముందు సెల్ఫీ దిగాడు. ప‌లు యాంగిల్స్‌లో సెల్ఫీ తీసుకున్నాడు. వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here