ఆటో మీద కారు.. ఎంత ఫైన్ వేశారంటే..!

మూడు చక్రాల ఆటో మీద ఓ కారును తీసుకొని వెళ్ళారు. ఇదేదో పెట్రోల్-డీజల్ ధరల మీద నిరసనగా కాదు..! ఈ వీడియోను చైనాలో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. కారు పాడైపోవడంతో దాన్ని తీసుకొని వెళ్ళడానికి ఇలా కొత్తగా ఆలోచించారు. అయినా అతడి ఆలోచనకు ఒప్పుకోవాలి. ఈ వీడియోను చూసి కొందరు నెటిజన్లు మెచ్చుకుంటూ ఉన్నారు.. మరికొందరేమో ఎంతో ప్రమాదకరమైనది గా భావిస్తున్నారు.

Image result for Chinese man transports abandoned car with three-wheeler

చైనా లోని జెజియాంగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన కారు పాడవడంతో దాని పార్టులను అమ్మేయాలని అనుకున్నాడు. దాన్ని ఓ చోటి నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి ఇలా ప్రయత్నించాడు. అయితే ఇది అక్కడి ట్రాఫిక్ పోలీసులకు మాత్రం నచ్చలేదు. ఏకంగా 1300 యువాన్లు ఫైన్ వేసేశారు. పాత సామాన్లకు వేయాలని అనుకున్న కారు వలన వచ్చేదే కొంత డబ్బులైతే.. ఇలా అది కూడా వెళ్ళిపోయెనే అని బాధపడుతున్నాడు కారు యజమాని..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here