ధనవంతుడు నువ్వా నేనా అని తేల్చుకోడానికి డబ్బులు కాల్చే పందెం..!

ఇద్దరు వ్యక్తుల్లో ధనవంతులు ఎవరో తెలుసుకోడానికి ఎవరి అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో.. ఎవరికి ఎంత ఆస్థులు ఉన్నాయో లెక్కపెడితే సరిపోతుంది. అదే ఇద్దరు తాగుబోతులు బార్ లో కూర్చుని ఎవడు ధనవంతుడు అని పోటీ పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. ఇద్దరు స్నేహితుల మధ్య ఎవరు ధనవంతుడు అనే విషయంలో గొడవ వచ్చింది. ముందుగానే తాగి ఉన్నారు కదా.. నేనే ధనవంతున్ని నీకన్నా అని అనుకుంటూ చివరికి నోట్లు తగలబెట్టే దాకా వెళ్ళారు. పోటీలుపడి తమ వద్ద ఉన్న కరెన్సీ నోట్లను తగలబెట్టారు. మొత్తం 100 యువాన్ నోట్లను కాల్చేశారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.

అయితే ఈ ఘటనకు సాక్ష్యంగా ఓ స్నేహితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది చివరకు పోలీసుల దాకా వెళ్ళింది. చైనాలో నోట్లను కాల్చడం క్రిమినల్ చర్య కావడంతో వారిని గుర్తించి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఇద్దరికీ చెరో 1,000 యువాన్లు జరిమానా విధించింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here