భూ వాతావ‌ర‌ణంలో ప్ర‌వేశించిన స్కైలాబ్! ఎక్క‌డ ప‌డుతుందో తేలింది!

బీజింగ్‌: అంత‌రిక్షంలో గ‌తి త‌ప్పిన ఓ స్కైలాబ్ భూమి వైపు దూసుకొస్తోంది. భూ వాతావ‌ర‌ణంలో ప్ర‌వేశించిన త‌రువాత గంట‌కు 28 వేల కిలోమీట‌ర్ల వేగంతో ప‌రిభ్ర‌మిస్తోన్న ఆ చైనా అంత‌రిక్ష ప‌రిశోధ‌నా కేంద్రం తియాంగ్యాంగ్‌-1 భూమిపై ఎక్క‌డ ప‌డుతుంద‌నే విష‌యాన్ని చైనా శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేశారు.

ప‌సిఫిక్ మ‌హా స‌ముద్ర ద‌క్షిణ తీర ప్రాంత‌మైన తాహితి ద్వీప స‌మీపంలో అది భూమిని తాకే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఈ విష‌యాన్ని చైనా ఏరోస్పేస్ కార్పొరేష‌న్ ధృవీక‌రించింది. ఆసియా ఖండం మీదుగా అంటే.. ప్ర‌త్యేకించి- భార‌త్ గ‌గ‌న‌త‌లం మీదుగా ఈ స్కైలాబ్ ప్ర‌యాణిస్తుంద‌ని, భూక‌క్ష్య‌లోకి ప్ర‌వేశించిన త‌రువాత ముక్క‌లై పోవ‌చ్చ‌ని అంటున్నారు.

తొమ్మిది ట‌న్నుల బ‌రువు ఉన్న ఈ అంత‌రిక్ష ప్ర‌యోగ కేంద్రం తియాంగ్యాంగ్‌-1ను చైనా ప్ర‌యోగించింది. ప్ర‌స్తుతం ఇది గ‌తి త‌ప్పింది. ప్ర‌స్తుతం భూమికి 175 కిలోమీట‌ర్ల ఎత్తులో ప్ర‌యాణిస్తోంద‌ని, గంట‌కు 28 వేల కిలోమీట‌ర్ల వేగంతో ప‌రిభ్ర‌మిస్తోంద‌ని చైనా శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు.

భూ క‌క్ష్య‌లోకి ప్ర‌వేశించిన త‌రువాత అది మండిపోయి, ముక్క‌లుగా మార‌క‌పోతే ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌ని అంటున్నారు. అందులోని హైడ్రాజిన్ ఇంధనం ఉందని, దీనివల్ల తీవ్ర ముప్పు వాటిల్ల వచ్చట‌.

తియాంగాంగ్‌-1ను 2011లో ప్రయోగించారు. ఐదేళ్ల పాటు ఇది భూమి చుట్టూ తిరుగుతూ చైనీస్‌ నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన మూడు మిషన్లకు బేస్‌స్టేషన్‌గా సేవలందించింది. అనంత‌రం సంబంధాలు తెగిపోయాయి. రెండేళ్ల కింద‌ట ఇది గ‌తి త‌ప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here