ఇదెక్క‌డి ప‌నిష్మెంట్ త‌ల్లీ! కుమారుడిని తాడుతో స్కూట‌ర్ వెన‌క్కి క‌ట్టి లాక్కెళ్లిన మ‌హిళ‌

బాగా అల్ల‌రి చేస్తున్నాడ‌నే ఒకే ఒక్క కార‌ణం. ఆ త‌ల్లికి కోపం తెప్పించింది. త‌న మాట విన‌ట్లేద‌నే అక్క‌సు ఆమెను విచ‌క్ష‌ణ కోల్పోయేలా చేసింది. కుమారుడిని ప‌ట్టుకుని చేతులు క‌ట్టేసింది.

అక్క‌డితో ఆగ‌లేదు. త‌న టూవీల‌ర్ వెన‌క్కి క‌ట్టేసి.. సుమారు అర కిలోమీట‌ర్ దూరం వ‌ర‌కూ లాక్కెళ్లింది. ఈ ఘ‌ట‌న చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది.

వారి పేర్లేమిటో తెలియ‌రావ‌ట్లేదు గానీ.. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. యునాన్ ప్రావిన్స్‌లోని ఝౌటాంగ్‌లో రోడ్ల‌పై ఈ దృశ్యం క‌నిపించింది.

స్థానికులు కొంద‌రు ఆ మ‌హిళ‌ను అడ్డుకుని.. కుమారుడిని విడిపించారు. ఈ సంద‌ర్భంగా వారు ఈ దృశ్యాన్ని వీడియో తీసి, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here