వేశ్యల దగ్గరకు వెళ్ళొద్దు అన్నందుకు పాక్ సైనికులను చితక్కొట్టారట..!

ప్రస్తుతం చైనా-పాకిస్థాన్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆ దేశ నేతలు చెబుతూ వస్తున్నారు. పాక్ మీద ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే.. చైనా ఊరికే ఉండదు అని కూడా పలుమార్లు హెచ్చరించారు. కానీ అక్కడ జరుగుతోంది వేరు.. బయటకు ఫ్రెండ్స్ లా అనుకుంటూ ఉన్నా.. లోలోపల కొట్టుకుంటూ ఉన్నారు ఆ అధికారులు. ఇక ఎకనామిక్ కారిడార్ పనులు ప్రారంభమవగా.. పాక్ లో ఉన్న చైనా కార్మికులను చిన్న చూపు చూస్తున్నారట పాక్ అధికారులు. కనీస వసతులు కూడా కల్పించకపోవడంతో చైనీస్ చాలా ఇబ్బందులు పడుతున్నారు పాకిస్థాన్ లో.. ఈ కోపమంతా ఒక్కసారిగా పాక్ సైన్యం మీద చూపించారు చైనా వాళ్ళు. వేశ్యల వద్దకు వెళ్ళకుండా అడ్డుకున్న పాక్ సైన్యాన్ని చితక్కొట్టారు.

కొంతమంది చైనా కార్మికులు, పాకిస్థాన్ లోని రెడ్ లైట్ ఏరియాకు వెళ్లేందుకు ప్రయత్నించిన వేళ, పోలీసులు అడ్డుకుని, వారికి ఆ ప్రాంతంలోని వేశ్యల వద్దకు ప్రవేశం లేదన్నారట. భవల్ పూర్, ఫైసలాబాద్ జాతీయ రహదారిపై ఉన్న రెడ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చైనా ఇంజనీర్లు క్యాంపస్ ను వదిలి వెళ్లేందుకు వీలులేదని, వారిని సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్లనివ్వబోమని సైన్యం స్పష్టం చేయడంతో పాకిస్థాన్ గార్డులు సేదదీరే ప్రాంతానికి వెళ్లే విద్యుత్ లైన్లను తొలగించారు. కుర్చీలు, బల్లలు సహా దొరికిన పరికరాలు తీసుకుని వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో కొందరు సైనికులకు గాయాలు అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here