ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా..? అంటూ తెగ చర్చించేసుకుంటూ ఉన్నారు..!

సాధారణంగా ఏదైనా ప్రతిష్టాత్మక సినిమాకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవాలని అభిమానులకు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు బాహుబలి సినిమా విషయంలో అదే జరిగింది. కొన్ని కొన్ని సార్లు సినిమాకు సంబంధించిన లీకేజీలు వారిని ఇబ్బందిని కూడా పెట్టాయి. ఇప్పుడు ఆ కష్టాలు మెగాస్టార్ సినిమాకు వచ్చాయి. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’కి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

ఈ మూవీ షూటింగ్ హైద్రాబాద్ పరిసరాల్లో నిర్మించిన సెట్స్ లో సాగుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్చిరంజీవి ఎలా ఉండనున్నారనే లుక్ ఒకటి బయటకు వచ్చేసింది. షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి పక్క బిల్డింగ్ మీద నుంచి తీసిన ఈ లుక్ లో.. నరసింహారెడ్డి పాత్రలో చిరు లుక్ ను లీక్ చేసేస్తోంది. ఈ ఫోటోలో ఉన్నది చిరంజీవే అని అర్ధమవుతున్నా.. మరీ అంత స్పష్టంగా అయితే లేదు. టీజర్ పోస్టర్ లో చిరంజీవి లుక్ ను వెనుక నుంచి చూపించగా.. ఇప్పుడు ఈ లీక్డ్ పోస్టర్ లో మెగాస్టార్ కాస్ట్యూమ్స్ తో సహా అన్నీ బయటకు వచ్చేశాయి. ఇప్పుడు ఈ లుక్ ను మెగా అభిమానులు.. సినీ అభిమానులు తెగ షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఈ లీకుల గోల ఆపాల్సిందే.. ఈరోజు ఫోటో బయటకు వచ్చేసింది.. రేపు పొద్దున ఏ సీనో.. బయటకు వచ్చేస్తే చాలా కష్టమే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here