పాత వీడియో పోస్ట్ చేసి.. చిరంజీవి ఏడిచారు అని ప్రచారం.. ఎందుకు ఇలా..!

రెండు రోజుల క్రితం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సిల్వర్ జూబ్లీ వేడుకల నిమిత్తం మెగాస్టార్ చిరంజీవి డల్లాస్ కు వెళ్ళారు. ఆయనతో పాటూ పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా అక్కడకు చేరుకున్నారు. అయితే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే మెగాస్టార్ చిరంజీవి కంటతడి పెట్టుకున్నాడని..! అయితే ఆ వీడియోను కానీ పరిశీలిస్తే చిరంజీవి క్లీన్ షేవ్ తో ఉన్నారు.. కానీ ఆయన వెళ్ళిన లేటెస్ట్ ఫోటోలను చూస్తే అందులో ఆయన గడ్డంతో ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయన్ను చూసిన వారెవరైనా సరే.. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా కనబడుతోందని చెబుతున్నారు.

డల్లాస్ కు వెళ్లిన చిరంజీవి అక్కడ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారని సోషల్ మీడియాల్లో, వివిధ న్యూస్ చానళ్లలో వైరల్ అవుతోంది. అయితే ఇది చాలా పాత వీడియో అని తేలింది. ఈ వీడియో ఐదేళ్ల క్రితం వీడియో అని ప్రవాసాంధ్రులు వివరణ ఇచ్చారు. 2013లో ఆయన డల్లాస్ కు వచ్చినప్పుడు తీసిన వీడియోను ఇప్పుడు తిరిగి అప్ లోడ్ చేశారు. కానీ కొందరు కావాలనే చిరంజీవిని తప్పుబట్టడానికే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవిని.. ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటివి చేస్తున్నారని ప్రవాసాంధ్రులు చెబుతున్నారు.

https://twitter.com/karnatiramu/status/990068937290235905

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here