గొంతు నొక్కుతూ అడ్డంగా దొరికిపోయిన ఫేమస్ సింగర్..!

ప్రముఖ పాప్ సింగర్ క్రిస్ బ్రౌన్ అడ్డంగా కెమెరాలకు దొరికిపోయాడు. ఈ 28ఏళ్ల ఫేమస్ సింగర్ మియామీలో ఉండగా తనతో పాటూ ఉన్న స్నేహితురాలి మెడను గట్టిగా నొక్కబోయాడు. ఆమెను గొంతును అతడు గట్టిగా నొక్కుతుండగా ఆమె భయంతో చూస్తూ ఉండిపోయింది. మియామీలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ 28 ఏళ్ల స్టార్ ను అడ్డుకోడానికి పక్కనే ఉన్న ఇంకో మహిళ వచ్చింది. అతడు చేస్తున్న ఈ పనిని ఎవరో దూరంగా ఉండి కెమెరాలో బంధించారు. వెంటనే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్తా వైరల్ అయిపోయాయి. అంతే కాకుండా క్రిస్ బ్రౌన్ చేసిన పనిని తిడుతూ ఉన్నారు నెటిజన్లు.

దీనిపై క్రిస్ లాయర్ స్పందించారు.. ఆమె క్రిస్ ఫ్రెండ్ అని.. వాళ్ళేదో సరదాగా ఆడుకుంటూ ఉన్నారని చెప్పుకొచ్చారు. ఎవరైతే ఆ ఫోటోలు తీశారో వాళ్ళకు పనిష్మెంట్ ఉంటుందని చెప్పారు. క్రిస్ గతంలో హాలీవుడ్ యాక్ట్రెస్, సింగర్ అయిన రిహానాతో డేటింగ్ చేశాడు. ఆ సమయంలో ఆమెతో అతడు తప్పుగా ప్రవర్తించడంతో అతడిని ఆరు నెలల పాటూ ప్రత్యేకంగా కౌన్సిలింగ్ సెంటర్ లో ఉంచారు. అందుకోసమే క్రిస్ ఇప్పుడు కూడా తప్పుగా ప్రవర్తించాడేమోనని నెటిజన్లు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here