ఎవ‌డికి ప‌డితే వాడికి..ఎక్క‌డ ప‌డితే అక్క‌డ సెల్ నంబ‌ర్ ఇస్తూ పోతే..`పోయిన‌ట్టే`: అదే చెబుతోందీ మూవీ!

త‌మిళ‌, తెలుగు న‌టుడు విశాల్ న‌టిస్తోన్న తాజా చిత్రం `అభిమన్యుడు..` ఈ సినిమా ట్రైల‌ర్ శుక్ర‌వారం విడుద‌లైంది. సెల్‌ఫోన్, ఆధార్‌కార్డు నంబ‌ర్లు అసాంఘిక శ‌క్తుల చేతుల్లో ప‌డితే జ‌రిగే న‌ష్టాన్ని వివ‌రించే మూవీలా అనిపిస్తోంది.

సెల్‌నంబ‌ర్ రాసి బాక్స్‌లో ప‌డేస్తే.. ల‌క్కీ డ్రాలో గిఫ్టులు వ‌స్తాయంటూ మ‌న వ‌ద్ద నుంచి తీసుకునే సెల్‌నంబ‌ర్ల‌ను ఆన్‌లైన్ సంస్థ‌ల‌కు విక్ర‌యించే విధానాన్ని ఇందులో చూపించారు. ఆ విష‌యం ట్రైల‌ర్‌లోనే తెలుస్తోంది.

ఆన్‌లైన్ మోసాలు, రోజూ మ‌న‌ల్ని స‌తాయించే కాల్ సెంట‌ర్ల నంబ‌ర్లు.. ఇలా వాట‌న్నింటి వ‌ల్ల మ‌న జీవితం ఎంత‌గా ప్ర‌భావిత‌మౌతుంద‌నే విష‌యాన్ని ఇందులో ప్ర‌స్తావించిన‌ట్టుంది.

విశాల్ స‌ర‌స‌న సమంత క‌థానాయిక‌. యాక్ష‌న్ కింగ్ అర్జున్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. పిఎస్ మిత్రన్ ద‌ర్శ‌కుడు. యువ‌న్ శంక‌ర్‌రాజా సంగీతాన్ని అందించిన ఈ మూవీ ఈ నెల 26వ తేదీన విడుద‌ల కానుంది.

మ‌న‌కు తెలిసి, మ‌న వ‌ద్ద నుంచి మ‌న సెల్ నంబ‌ర్ల‌ను తీసుకుని ఆన్‌లైన్ సంస్థ‌ల‌కు విక్ర‌యించుకుంటూ, ఆదాయాన్ని ఆర్జిస్తున్నార‌నే విష‌యాన్ని ఈ మూవీలో వివ‌రించిన‌ట్టుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here